
పయనించే సూర్యుడు జూలై 16 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో మున్సిపల్ కార్మికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం నుండి సూళ్లూరుపేట పట్టణ పురవీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది, అనంతరం సూళ్లూరుపేట పట్టణ నాయకులు ఎస్.కె రియాజ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సిఐటియు రాష్ట్ర నాయకులను చర్చలకు ఆహ్వానించి, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని తెలియజేశారు పై కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె లక్ష్మయ్య సిపిఎం పార్టీ టౌన్ శాఖ సభ్యులు ఎస్.కె అక్బర్ బాషా, మరియు టౌన్ ఆగ్జలరిశాఖ సభ్యులు ఎస్.కె ఫయాజ్, మాలిక్, శామ్యూల్,SFI నాయకులు నాగరాజు, ఈ మరియు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు వెంకటరత్నం, రామయ్య, రవి, మురళి, రాజు,బాబు,చిన్నయ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
