
సింగనమల మండల సిపిఎం కార్యదర్శి భాస్కర్
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 న్యూస్ సింగనమల మండలంలోని రాచేపల్లి గ్రామ వద్దనున్న చెప్పుల లెదర్ ఎందుకంటే తోల్ల పరిశ్రమ ఓపెన్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి చూపించాలని కోరుతూ . రైతులందరికీ మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంచాలి. సింగనమల తరిమెల ప్రభుత్వ హాస్పిటల్ నందు 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని మరియు మండలంలో అన్ని గ్రామాలలో ప్రజలు నాలుగైదు రోజుల్లో కు వస్తున్న వర్షానికి ప్రజలు జలుబు చేసి విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి శానిటైజర్ పిచికారి వెంటనే చేయాలని తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ పెండింగ్ బిల్లును దాదాపుగా 5 నుంచి 6 వారాల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వెంటనే ఈ పెండింగ్ బిల్లులు కూలీల ఖాతాలోకి జమ చేయాలని. తరిమెల గ్రామంలో రైతు భరోసా కేంద్రం దాదాపుగా 8 వారాల నుండి రైతు భరోసా కేంద్రం మూతబడింది వెంటనే ఈ రైతు భరోసా కేంద్రంలో అధికారిని నియమించి రైతు భరోసా కేంద్రం తెరిపించే విధంగా చూడాలని కోరుతూ. హెచ్ ఎల్ సి చిరాయకట్టు సలకం చెరువు వరకు సాగునీరు అందించి రైతులని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో జిప్సం జింకు రైతులకు అందించి అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ఆనందరావుపేట గ్రామంలో వీధిలైట్లు పడలేదు వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. మండలంలోని విద్యుత్ ఏఈ రెగ్యులర్ గా ఉండే విధంగా అధికారి నియమించాలి. కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు వెంటనే అందించాలి.