
పయనించే సూర్యుడు మార్చి 1 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం నాడు సుండుపల్లె మండలం నందు పర్యటిస్తూ సుండుపల్లె టౌన్ నందు ఆరెమ్మ గుడి వీధి,జె ఆర్ నగర్ వీధి లకు సంబంధించి నూతన సి.సి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.అదేవిధంగా రోడ్డు నాణ్యత విషయంలో రాజీ ప్రసక్తే లేదని ప్రమాణాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సుండుపల్లె మండలంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు.జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లే రెడ్డప్ప,మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు,మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు,టిడిపి సీనియర్ నాయకులు శివరాం నాయుడు, రాయవరం సర్పంచ్ షరీఫ్, గ్రామ అధ్యక్షులు సుబ్బరామ, పార్లమెంట్ అధికార ప్రతినిధి కిరణ్, కుమార్ నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, మస్తాన్ బాబు,గౌస్,మంగిరి సురేష్,జనసేన అధ్యక్షులు రాజా,జంగిలి ఓబులేష్,మహిళా నాయకురాలు కల్పన,సంతోష్, సుండుపల్లె బిజెపి నాయకులు వెంకటరామరాజు,బిజెపి అధ్యక్షుడు రమణ గౌడ్, పెదినేని కాలువ సర్పంచ్ నాగేంద్ర,ఎల్వి రమణ,ఏజెంట్ రమణ బీసీ నాయకులు రమణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.