
పయనించే సూర్యుడు మే 27 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్షాకాలంతో వచ్చే సీజనల్ వ్యాధులను నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ అధికారులు జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలేరియా వ్యాధిని వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. అపరిశుభ్రత దృశ్య సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం లేకుండా, ప్రతి డ్రైన్ ను శుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ ను తొలగించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి శుభ్రం చేయడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. శుభ్రమైన ఆహారాన్ని తినాలని, ఆకు కూరలు, కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలని, ఉడికించిన ఆహారాన్ని తినాలని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫీవర్ సర్వే, చేయాలని వైద్య శిబిరాల నిర్వహణ చేయాలని ఆయన తెలిపారు. అన్ని ఆసుపత్రులలో వ్యాధి నిర్ధారణ కిట్లు మరియు మందులు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని పాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్వహించిన పరీక్షల వివరాలు రిజిస్టర్ లో నమోదు చెయ్యాలి.అశ్వస్తకు గురి అయిన విద్యార్థులకు తగిన వైద్యం అందించాలి. వసతి గృహలలో కిచెన్ షెడ్ లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణపై వాట్సాప్ సందేశాలు గ్రూపుల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు సూచించారు.ఎక్కడైతే నీరు నిల్వలు ఉంటాయో అక్కడ ఇంకుడు గుంతలు నిర్మాణాలు మరియు అజోళ్ల పెంపకం చేపట్టాలి ఈ కార్యక్రమంలో టీడీ ట్రైబల్ వెలఫైర్ మణెమ్మ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్,డీసీ హెచ్ ఓ రవిబాబు,జిల్లా విద్య శాఖ అధికారి వెంకటేశ్వర చారి,జిల్లా మలేరియా అధికారి స్పందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, పాల్వంచ మునిసిపల్ కమిషనర్ సుజాత, మిషన్ భగీదరా ఈ ఈ లు తిరుమలేష్, నళిని, జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జయలక్ష్మి మరియు జిల్లా అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.