
పయనించే సూర్యుడు జూలై 11 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట పురపాలక సంఘము పరిధిలో జాతీయ రహదారి సమీపంలో గల డంపింగ్ యార్డ్ యందు దాదాపు 38168 మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వారు స్వచంధ్ర కార్పొరేషన్ టెండర్ ద్వారా జిగ్మా కంపెనీ లెగసీ వేస్ట్ ను Bio-mining పద్ధతి ద్వారా పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరుగుతుంది. ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ సూళ్లూరుపేట పురపాలక సంఘ డంపింగ్ యార్డ్ నందు లెగసీ వేస్ట్ నిర్వహణ పనులను సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ఇతర మండల స్థాయి అధికారులతో కలసి పరిశీలించడమైనది. ఈ కార్యక్రమంలో కే.చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ లెగసీ వేస్ నిర్వహణ పనులు పురోగతిని కలెక్టర్ కు స్వయంగా నివేదించడమైనది. ఈ కార్యక్రమంలో జిగ్మా కంపెనీ కు సంబంధించి అధికారులు కూడా పాల్గొనడం జరిగింది.
