
3500 విలువ గల నెట్ బహుకరన..
కమలాపూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు..
పయనించే సూర్యడు, మే 19, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి )
భీమ్ రావు యూత్ అసోసియేషన్ ఉప్పల్ గ్రామంలో 7 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయస్సు గల పిల్లలకి క్రికెట్ & వాలీబాల్ ఉచిత శిక్షణ కోచింగ్ సెంటర్ కు కమలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్ క్రికెట్ నెట్ రూ (3500 ) బహూకరించడం జరిగింది, ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మండలంలోని పిల్లలు ఎలాంటి చెడు అలవాట్లకు, సెల్పోన్లకు కు బానిసలు కాకుండా, ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. పిల్లలు చాలా ఆనందం తో శ్రీకాంత్ కి కృతజ్ఞతలు తెలిపారు.