
పయనించే సూర్యుడు న్యూస్ ( జనవరి.26/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్:- రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వర్తిస్తూ సకాలంలో అందించినందుకు వరదయ్యపాలెం డిప్యూటీ తహశీల్దార్ వెంకటసుబ్బయ్య ఉత్తమ సేవా పురస్కారం (ప్రశంసాపత్రాన్ని) అందుకున్నారు.
ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుళ్ళూరుపేట ఆర్డీవో కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉత్తమ డిప్యూటీతహశీల్దార్ గా వెంకటసుబ్బయ్యకు సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ మరియు ఆర్డిఓ కిరణ్ మై చేతులు మీదుగా ఈ అవార్డును ప్రధానం చేశారు.
ఉత్తమ డీటీగా ప్రశంసాపత్రం అవార్డు అందుకున్న వెంకట సుబ్బయ్యను తహశీల్దారు రాజశేఖర్, రెవెన్యూ సిబ్బంది వీఆర్వోలు మరియు మీడియా మిత్రులు, స్థానిక నాయకులు ప్రజలు అభినందనలు తెలిపార.