ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్.
పయనించే సూర్యుడు: జనవరి11: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే విషయంలో ముందస్తు చర్యలలో భాగంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కట్టుబడి క్రమశిక్షణతో ఉండాలని పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయనీ హెచ్చరించారు
కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండాలనీ,
ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుక వెళ్లాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రతిమండల అధ్యక్షులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనీ,గ్రామాల్లో చిన్న సమస్యలు ఉంటే గ్రామములో కూర్చొని పరిష్కరించాలే తప్ప బయట ఎక్కడ కూడా మాట్లాడవద్దనీ సూచించారు
పార్టీ కోసం పని చేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని తెలియజేశారు మంత్రి వర్యులు సీతక్క ఆదేశాలను తప్పక పాటించాలనీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యడం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలనీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్ఠానం సూచించిన సూచన మేరకే నడుచుకోవాలని తెలియజేశారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని
సీనియర్లు, జూనియర్ లు అందరూ కలిసికట్టుగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయనీ తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గెలుపు కోసం పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.