
ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు
గాంధీ భవన్ లో ఘనంగా బీసీ రిజర్వేషన్ సంబరాలు
రిజర్వేషన్ పెంపుదలకు అన్ని పార్టీలు సహకరించాలి – మంత్రి వాకిటి శ్రీహరి
సమన్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూలై 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం లో రిజర్వేషన్లు కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపటం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవ రావు తెలిపారు. విద్య, ఉద్యోగాలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఈ ఏడా మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి రిజర్వేషన్ పెంపుదలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ… సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. అదేవిధంగాఎన్నో దశాబ్దాలుగా రిజర్వేషన్ పెంపుదల కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయామని,కానీ నేడు ఎంతో పట్టుదలతో కామారెడ్డి డిక్లరేషన్ అమలుకోసం కోర్టు పరంగా చిక్కులు రాకుండా డెడికేషన్ కమిషన్ నియమించామని తెలిపారు. రిజర్వేషన్ పెంపుదలకు రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి సారధ్యంలో అతి త్వరలో రిజర్వేషన్లు అమలుచేసి చిరకాల స్వప్నము సాధించబోతున్నామని తెలిపారు.
