
మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి..
చందోలు ఎస్సై మర్రి శివకుమార్..
పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21 :- రిపోర్టర్ (కే.శివకృష్ణ )
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్” లో భాగంగా శనివారం బాపట్ల జిల్లా చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాలపై చందోలు పోలీస్ స్టేషన్ ఎస్సై మర్రి శివకుమార్ సిబ్బందితో కలిసి శ్రమదానం నిర్వహించారు… స్టేషన్ పరిధిలో మొక్కలు నాటి చెత్తాచెదారాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ, పని చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.. ప్రజల్లో శుభ్రత పై అవగాహన పెంచే ఉద్దేశంతో వ్యర్థాలు తొలగించి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చందోలు ఎస్సై మర్రి శివకుమార్ అన్నారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..