
పయనించే సూర్యుడు గాంధారి 19/06/25
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి క్రీడా ప్రాంగణంలో బుదవారం హకింపేట్ క్రీడా పాఠశాలకు ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడిగా లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు, మండల నలుమూలల నుండి 20 అంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా ముగ్గురు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం తో వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేసి నట్లు ఆయన సూచించారు, మూడవ తరగతి ఉత్తీర్ణత అయి 4 తరగతి లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ఎంపికలు 23 నా జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి, ఎంపిక కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రంగా వేంకటేశ్వర గౌడ్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ్, సత్యం పాల్గొన్నారు