Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్""హారహోరి గా జరిగిన దివ్య బాలయేసు దేవాలయం లో కబడ్డీ పోటీలు""

“”హారహోరి గా జరిగిన దివ్య బాలయేసు దేవాలయం లో కబడ్డీ పోటీలు””

Listen to this article

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్లు జి పెద్దన్న

నంద్యాల జిల్లా
గడివేముల మండలం లోని మంచాలకట్ట గ్రామంలోని దివ్య బాలయేసు దేవాలయం దేవాలయం నందు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీలలో సుమారు 50 జట్టు లు పైగా వచ్చి కబడ్డీ ఆటలో తలపడ్డారు. భోజన సదుపాయాలతో, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయ లు కల్పించి ఫాదర్ తోట జోసెఫ్ గారు దివ్య బాల యేసు పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చారు.వీరిలో మొదటి విజేత గోనెగండ్ల జట్టు, రెండవ విజేత నూతనపల్లి, మూడవ విజేత పంచాలింగాల, నాల్గవ విజేత శివనంది, అయిదవ విజేత మంచాలకట్ట, ఆరవ విజేత గడివేముల జట్టులు బహుమతులు గెలుచుకొని విజేతలు గా నిలిచారు. వీరికి బహుమతులు అందచేసిన టువంటి వారు నంద్యాల డీన్ ఫాథర్ మరెడ్డి, విచారణ గురువులు ఫాదర్ జోసెఫ్, కల్లూరు విచారణ గురువులు ఫాదర్ లహస్రయి, జీవ సుధ పాస్ట్రాల్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు, గ్రామ పెద్దలు, సంఘపెద్దలు, ఆర్గనైజేర్లు, అంపైర్లు పాల్గొని జిల్లాస్తాయి పోటీలను ఏ వివాదనికి దారి తీయకుండా జరపడం విశేషమని గ్రామస్థులు తెలపడం జరిగింది. అలాగే మంచాలకట్ట గ్రామంలోని దివ్య బాలయేసు పండగను గ్రామస్తులు,బంధువులు ఎంతో ఉత్సాహంగ, పండుగ వాతావర్ణన్ని ప్రార్థనలతో భక్తి శ్రద్దలతో ఎంతో ఆనందదాయకంగా జరిపారు. ఈ పండుగ కార్యా క్రమం లో భాగంగా మహా గణ శ్రీ శ్రీ గోరంట్ల జ్వానేష్ గారు ముఖ్య అతిధి గా పాల్గొని గ్రామ లోని దివ్య బాలయేసు పండుగ ను పురస్కరించుకొని పూజలు, ప్రార్ధన లు తో అధ్యాత్మికంగా విశ్వాసులు కు ఇలాంటివి ఎన్నో జరపుకోవాలని భక్తి శ్రద్దలతో
ఏదగాలని ఆశీర్వదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments