
సినీ హీరో సుమన్ తల్వార్ ను శాలువాతో సన్మానం చేసినా జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా షొటో ఖాన్ మాస్టర్ శివక్రిష్ణ గౌడ్
విద్యార్థులకు బెల్టు మరియు సర్టిఫికెట్లు అందజేసిన
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా మునిసిపాలిటీలోని కొత్తూరు మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ దగ్గర కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొండారెడ్డి నరసింహ కొండారెడ్డి శారద దంపతుల కుమారుడు కొండారెడ్డి శివ ఆరెంజ్ బెల్ట్ మరియు మందుల శ్రీకాంత్ మందుల సునీత దంపతుల కుమారుడు వాసుదేవ్ ఎల్లో బెల్ట్ సాధించినారు విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్స్ అందజేస్తూ సుమన్ తల్వార్ గారు మాట్లాడుతూ బాల బాలికలకు కరాటే ఆత్మ రక్షణకై ఎంతో ఉపయోగపడుతుందని మానసిక శారీరక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కరాటే విద్యలో తమ పిల్లలకు నేర్పించడానికి ముందుకు రావాలని కోరుతూ మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ ను అభినందిస్తూ ఈ విద్యార్థులనుకచ్చితంగా బ్లాక్ బెల్ట్ వరకు నేర్పించాలని అన్నారు.
