
పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 24 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లొ భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న, హుజురాబాద్ పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రలు, నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాగవారెడ్డి మాట్లాడుతూ..రాత్రి మూడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారన్నారు . కత్తి మెడపై పెట్టి బెదిరించి,టవల్తో నోరు, కాళ్లు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఇంట్లో 70 తులల బంగారం, రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లారని, వెంటనే మా కుమారులకు ఫోన్ చేసి, 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
