జూలూరుపాడు మండల పయనించే సూర్యుడు.. చిన్నారులకు భోగి పండ్లతో దీవెనలు మండలంలోని వివిధ గ్రామాలలో సోమవారం భోగి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు పండుగను జరుపుకుంటారు దీనిలో భాగంగా మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి మూడవరోజు కనుమ పండుగను జరుపు కోవడం ఆనవాయితీ భోగి సందర్భంగా మహిళలు ముగ్గులు వేసి రంగులతో అలంకరించి భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో వేడుకలను నిర్వహించారు చిన్నారులకు భోగి పండ్లు పోసి దీవెనలు అందించారు అల్లుళ్లు ఆడబిడ్డలు రాకపోకలతో గ్రామాల్లో సందడి నెలకొంది మహిళలు పిండి వంటలు తయారీలో నిమగ్నమయ్యారు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపించింది