Sunday, February 2, 2025
HomeUncategorizedఅగ్రకులాల కంటే మాలలే ప్రమాదకరం మందకృష్ణ మాదిగ

అగ్రకులాల కంటే మాలలే ప్రమాదకరం మందకృష్ణ మాదిగ

Listen to this article

  • అగ్రకులాల కంటే మాలలే ప్రమాదకరం మందకృష్ణ మాదిగ
  • పయనించే సూర్యుడు/జనవరి 17/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
  • ఎంతకాలం మౌనంగా ఉండాలి
  • మాదిగలకు అన్ని పార్టీల మద్దతు ఉంది
  • నువ్వు మాదిగ వైతే డప్పు వేసుకొని రా
  • తెలంగాణ గడ్డపై ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేసే కుట్ర జరుగుతుంది. మంద కృష్ణ మాదిగ
    తెలంగాణ గడ్డపై ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఏన్కూర్ లో స్థానిక ఠాగూర్ కళ్యాణమండపం నందు ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించిన ఎస్సీ వర్గీకరణను మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, త్వరగా వర్గీకరణ చేయడం కోసమే ఒక మహత్తర కార్యక్రమమే ఈ వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమమని అన్నారు. మన ఆవేదనైన ఆకాంక్ష అయిన మన చేతిలో ఉండే వేయి గొంతులు లక్ష్య డబ్బులు గా తరలి రావాలి మహత్తర కార్యక్రమమని వ్యాక్యానించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇంటికో డప్పు కొనాలని, ఇంట్లో ఉన్న వారిలో కనీసం ఒక్కరైనా డప్పు వేసుకొని హైదరాబాద్కు రావాలని కార్యకర్తల ను కోరారు. మీరు సర్పంచ్ ఎంపీటీసీ ఆ జడ్పిటిసి నా డాక్టరా లాయరా పక్కన పెట్టండి, నువ్వు మాదిగ వైతే డప్పు వేసుకొని రా అంటూ కార్యకర్తలను ఉత్తేజిపరిచారు. మన ఆవేదన ఆకాంక్ష తెలియజేయడం కోసం నడుం బిగించాలని అన్నారు. లక్ష డప్పు లు ఒకేసారి హైదరాబాద్ నగరంలో మ్రోగితే ప్రపంచం మొత్తం వింటుందని అన్నారు. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి కానీ వారి సాంస్కృతిక వాయిద్యం, ఉద్యమంగా ఇంతవరకు మారలేదు. మన ఉద్యమానికి అడ్డు తగులుతున్నది షెడ్యూల్ కులమైన మాలలు అని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాల కంటే మాలలే ప్రమాదకరమని, 1994లో ఉద్యమం మొదలుపెట్టి 97 నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్గీకరణ సాధించామని, దాన్ని ఆమోదించిన రెండు నెలలలో మాదిగ బిడ్డలు వందల ఉద్యోగాలు సాధించి డాక్టర్లుగా మారారని అన్నారు. మాదిగలకు అన్ని పార్టీల మద్దతు ఉందని, మాలలందరూ మన వాదులు కాకపోవచ్చు కానీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేవారు మాత్రమే మనవాదులు అని అన్నారు. ఏకకాలంలో మూడు పదవులు పొందే శక్తివం తులు వారే మనకు అడ్డు తగులుతున్నారని వెనకడుగు వేస్తున్నారని, నోటి కాడ కూడు గుంజుకుంటుంటే ఎంతకాలం మౌనంగా ఉండాలని అన్నారు. తెలంగాణ గడ్డమీద నూటికి 70 శాతం మంది మాదిగలున్న ఈ రాష్ట్రంలో నూటికి 25% ఉన్న మాలలు అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆవేదన ఆకాంక్ష చాటడానికి ఈ మహత్తర కార్యక్రమమని, 30 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేశామని, సమస్త సమాజానికి అండగా నిలబడ్డ చరిత్ర ఎమ్మార్పీఎస్ ధని అన్నారు. సమాజం అండ మనకున్నది ధర్మం మన వైపు ఉన్నది ఒక ఊరిలో ఒక డప్పు కొడితే ఊరు మొత్తం తెలుస్తుంది అదే లక్ష డప్పు లు ఒకేసారి మోపితే ప్రపంచం మొత్తం తెలుస్తుంది మన జాతి బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడం కోసం మనం పోరాడుదాం. మాలలకు లక్ష కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ మనకి లక్షల డప్పు లు ఉన్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 7న జరిగే ఈ లక్ష డప్పు లు వేయి గొంతుల సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, వివిధ మండలాల నాయకులు, వివిధ గ్రామాలలోని ఎమ్మార్పీఎస్ నాయకులు వందలాదిమందిగా పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments