Sunday, March 16, 2025
HomeUncategorizedఆయన రూటే సపరేటు

ఆయన రూటే సపరేటు

Listen to this article

ప్రభుత్వం నియమించిన బయోమెట్రిక్ ఏమాయ

తాళాలు తెరుచుకోని అన్నసముద్రం ఆర్. బి. కే కార్యాలయం

గ్రామసచివాలయాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 త్రిపురాంతకం మండలం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలలోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో పలు శాఖల అధికారులను నియమించి ప్రజలకు సౌలభ్యంగా సేవలందించేలా గ్రామ సచివాలయాలకు ఉద్యోగులను నియమిస్తే
వారు మాత్రం నెల నెల జీతం తీసుకుంటూ విధులకు మాత్రం నెలలో నాలుగు రోజులు మాత్రమే హాజరవుతారని సాక్షాత్తు ఈ తంతు అన్నసముద్రం గ్రామంలో వ్యవసాయ సహాయకులు అంతా ఆయన ఇష్టం వచ్చినట్టుగానే వ్యవహరిస్తున్నాడని సాక్షాత్తుఅన్నసముద్రం గ్రామ సచివాలయంలోని పలువురు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు
ఈయన 2021 22 సంవత్సరంలో త్రిపురాంతకం ఆర్ బి కే కార్యాలయం టూ లో రెగ్యులర్ ఉద్యోగుగా పనిచేసే కంకణాలపల్లె ఇన్చార్జి వ్యవసాయ సహాయకులుగా పనిచేసి అప్పట్లో కొందరు ఎరువుల దుకాణదారులతో చేతులు కలిపి కంకణాలపల్లి రెవిన్యూ గ్రామంలో భూములు లేని రైతుల పేరుతో ప్యాడి పె క్రూట్ ఇన్సూరెన్స్ ఓడ్లు పండకపోయినా పండినట్లు త్రిపురాంతకం వ్యవసాయ పరపతి సంఘం ద్వారా వడ్లను విక్రయించినట్లు ఒంగోలులోని పలు రేషన్ మిల్లులలో గుమస్తాల పేరుల మీద ఒడ్లు విక్రయించినట్లు కోట్లు కొల్లగొట్టారని
అంతేకాకుండా అప్పట్లో త్రిపురాంతకం ఎలాంటి భూమి లేని వర్తక వ్యాపారుల పేరులతో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ నిధులను వర్తక వ్యాపారులలో ఓ దళారీ తో చేతులు కలిపి ఒక్కోరైతు పేరుపై ఇన్సూరెన్స్ ఎకౌంట్లలో పడిన నిధులను వీరిద్దరూ కలిసి వారి ఖాతాలలో పడిన ఈ క్రాప్ ఇన్సూరెన్స్ నగదును త్రిపురాంతకం లోని వర్తక వ్యాపార అయినటువంటి దళారి ద్వారా అందరి నుండి తిరిగి నగదును రాబట్టి భాగాలు పంచుకున్న వైనం అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అప్పటిజిల్లా జాయింట్ కలెక్టర్ అక్రమాలకు పాల్పడిన పలువురు వ్యవసాయ సహాయకులపై సస్పెండ్ చేయాల్సిందిగా అప్పటి తాసిల్దార్ ను ఆదేశించారు
ప్రభుత్వ నిధులను దారి మళ్లించుటలో సిద్ధహస్తులైన వీరిపై విచారణ జరిపిన అప్పటి తాసిల్దారు సస్పెండ్ కూడా చేశారు అయినా వారి యొక్క రాజకీయ పలుకుబడితో తిరిగి నాలుగు నెలల కాలంలోనే ఉద్యోగంలో చేరారు అయితే విధులు నిర్వహిస్తున్న సచివాలయాల నుండి స్థానచలనం కలిగించి అన్న సముద్రం వ్యవసాయ సహాయకులను దూపాడు నియమించి త్రిపురాంతకం వ్యవసాయ సహాయకులను అన్న సముద్రం నియమించడంతో ఊపిరి పీల్చుకున్న వీరు ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాలలో ఉన్న రాజకీయ పలుకుబడివారికి దగ్గర అవడంతో విధులకు కూడా సక్రమంగా రాని వైనం మండలంలోని అధికారులకు తెలియచే జరుగుతుందా లేక వారి కనుసైగల్లోనే జరుగుతుందా అనే దానిపై ఉన్నతాధికారులు అన్నసముద్రం గ్రామ సచివాలయంలోని వ్యవసాయ కార్యాలయం పై దృష్టి సారించి విధులకు హాజరుకాని వ్యవసాయ సహాయకులపై చర్యలు తీసుకొని గ్రామంలోని రైతులకు సేవలు అందించేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments