పయనించేసూర్యుడు. న్యూస్.30.జనవరి. పుల్కల్ ప్రతినిది.
పుల్కల్ మండలం. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనిపుల్కల్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల విజయ్ కుమార్ అన్నారు.పుల్కల్ మండల కేంద్రంలోని గాంధీ చిత్రపటం వద్ద బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీవిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గాందీ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా మాచర్లవిజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు 420 రోజులు గడుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల పై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చడం లేదని, ప్రజా పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.యస్.కార్యకర్తలు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.