
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 4:- రిపోర్టర్ (కే.శివకృష్ణ )
బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్జీలు ఇవ్వడానికి బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాదలచిన వారు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.