
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //6//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
గురువారము రోజున ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అనిత దేవి,మాట్లాడుతూ…విద్యార్థులలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని , అన్నారు.అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి నలుగురు విద్యార్థులకు బహుమతులను స్పెషల్ ఆఫీసర్ అనిత దేవి చేతుల మీదుగా ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) బహుమతులు అందజేశారు. బహుమతులు వి కీర్తన, ఈ శ్వేత బిందు, బి హనీ, ఎం అలేఖ్య లకు శంకర్ నారాయణ డిక్షనరీలు మరియు మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయినీలు అందరూ పాల్గొన్నారు.