Monday, April 21, 2025
HomeUncategorizedకలకలం రేపిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిఆత్మహత్యా యత్నా

కలకలం రేపిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిఆత్మహత్యా యత్నా

Listen to this article

నీను నిజాయితీగా పనిచేస్తా

నాపైయి తప్పుడు ప్రసారాలు చేసారు

ఫిబ్రవరి 4
పయనించే సూర్యుడు
వెంకటాపురం మండల ప్రతినిధి
బట్టా శ్రీనివాసరావు

ములుగు జిల్లా(నూగూరు) వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ధనలక్ష్మి తన నివాస గృహంలో చేతిపై కత్తితో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కారు డ్రైవర్ ఉదయం ఆమె ఇంటికి వెళ్ళగా చేతికి కత్తి తో కోసుకొని సృహకోల్పోయి ఉన్న ఆమెను పరిస్థితిని గమనించి వెంటనే హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ఆమెకు చికిత్స చేసిన డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వివరాల్లోకి వెలితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్ గా పని చేస్తున్న ధనలక్ష్మిని, 2024 నవంబర్ నెలలో వెంకటాపురం సిడిపిఓగా బదిలీ చేశారు. ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్లకు ,సిడిపిఓకు మధ్య అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి సస్పెండ్ చేపిస్తా మని ప్రచారంచేయడంతో భయభ్రాంతులకు, మనోవేదనకు గురై నీను ఆత్మహత్యయానికి పాల్పడినట్లు చికిత్స పొందుతున్న సిడిపిఓ ధనలక్ష్మి మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని, ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు అందరితో కుటుంబంగా కలిసిమెలిసి పనిచేస్తానని, అయితే కొంతమంది కావాలని నా పై తప్పుడు ఫిర్యాదు చేస్తూ, తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని సిడిపిఓ ధనలక్ష్మి తెలిపారు. సిడిపిఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో వాజేడు, వెంకటాపురం మండలాల్లో 168 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వెంకటాపురం మండలం లో 94, వాజేడు మండలంలో 74 కేంద్రాలు ఉన్నాయి. సిడిపిఓ ఆత్మహత్య సంఘటన మీడియా ద్వారా తెలుసుకున్న పలువు రు అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు, ఆయాలు వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకొని ఆమె పరమర్చింసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments