
జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్పర్సన్ దావా వసంత.
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 29 మామిడిపెల్లి లక్ష్మణ్:- రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రాయికల్ ను గ్రామం నుండి పట్టణంగా మార్చిన ఘనత కవితక్కది అని,మొదటి సారి రాయికల్ మున్సిపాలిటీకి ఎన్నికైన పాలకవర్గం చిరస్థాయి గా చరిత్రలో నిలిచిపోతుందని, కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీ వర్కర్లతో పాటు పరిశుభ్రతలో,సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్,ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని,ఆర్ధిక వనరులు సమకూర్చిన కెసిఆర్ కి, కవిత కి ధన్య వాదాలు తెలిపారు. ఇప్పటికీ రాయికల్ పట్టణంలో శంకుస్థాపన చేస్తున్న పనులు అన్ని కవితక్క మంజూరు చేసిన నిధులే అని అన్నారు. రాయికల్ పట్టణ మున్సిపల్ నూతన భవనం కూడా కవితక్క మంజూరు చేసిన నిధులే అని,ఏడాది కాలం పూర్తి అయిన కూడా ఆరు పథకాలకు ఏవని ప్రశ్నించారు.
పెన్షన్ పెంపు చేస్తాం అన్నారు , రుణమాఫీ పూర్తి కాలేదని, యువ వికాసం కింద స్కూటీ లేదని.మాటలు నీటి మూటలైనాయని.. జనవరి 26 కి రైతు భరోసా ఇస్తామని అన్నారని..ఇప్పటికి లేదని.. దుర్మార్గపు పాలన కాంగ్రెస్ దని,నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు,సొంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పార్టీ మారారని,అభివృద్ధి కోసం పోయిన అన్న ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపెట్టాలని అన్నారు.
అనంతరం రాయికల్ మున్సిపాలిటీకి కృషి చేసిన కవితక్కకి నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మండల అధ్యక్షులు
ఎలిగేటి అనిల్ ,బర్కం మల్లేష్, మాజీ ఏఎంసి చైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి , తాజా మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్, సాయి కూమర్, సువర్ణ సత్యనారాయణ, తాజా మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు,మండల సమన్వయ సమితి సభ్యులు కంటే గంగారం,మాజీ ఉపసర్పంచ్ సాగర్ రావు, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మాజీ కో ఆప్టన్ మెంబర్ సోహైల్, ఎస్సీ విభాగం అధ్యక్షులు నీరటి శ్రీను, యువజన విభాగం నాయకులు అభికృష్ణ,కోల కుమార్ ,నాయకులు ప్రతాప్ రెడ్డి, రొట్టే శ్రీను, బాబా, లక్ష్మీ ,రాంచంద్రం,మహేష్ , వినోద్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.