
గ్రామాల్లోని యువతను క్రీడల పట్ల ప్రోత్సహిస్తాం..
స్వయంగా ముఖ్యమంత్రి క్రీడాకారుడు..
ఆర్.ఆర్. టోర్నమెంట్ నిర్వహుకులను అభినందిచిన ప్రణవ్..
క్రీడాకారులకు బహుమతులు అందజేత..
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి //10// హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. గ్రామాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు ఆర్ఆర్ లాంటి క్రికెట్ టోర్నమెంట్ లు ఉపయోగపడతాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించి,బహుమతులను అందజేశారు.హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్ లో విజేతగా కరీంనగర్ జట్టు,రన్నర్ గా హుజురాబాద్ జట్లు నిలిచాయి.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ.. క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని,యువకుల్లో క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో నిర్వహించాలని దానికి నా వంతు సహాయ,సహకారాలు అందజేస్తానని తెలిపారు.క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేస్తామని తెలిపారు.టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతీ క్రీడకారున్ని ప్రణవ్ అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.