
సీఐటీయూ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
పయనించేసూర్యుడు ఫిబ్రవరి 25 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)ఇల్లందుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మాయదారి బడ్జెట్ అని ఈ బడ్జెట్ ను సవరణ ద్వారా ఫైనాన్స్ సపోర్టు కల్పించి రైతు వ్యవసాయ కూలీ,కార్మికులకు కనీస వేతనాలు,కూలీ రేట్ల పెంపు,కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీకి రెట్టింపు నిధులు,విద్య వైద్యానికి నిధులు పెంచాలని సీఐటీయూ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐకేఎస్, సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఏలూరి భవన్ లో సదస్సు నిర్వహించడం జరుగుతుందని,ఈ సదస్సు కు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జే రమేష్ ముఖ్య వక్తగా పాల్గొంటారని సీఐటీయూ జిల్లా,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ తెలిపారు. ఏలూరి భవన్ లో సీఐటీయూ మండల కమిటీ సమావేశం తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ శ్రామికులకు,ప్రజలకు నష్ట దాయకంగా ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో కే మరియా, ఎస్ కే ఫాతిమా, సీ హెచ్ రాంబాయి,వెంకటమ్మ, జీ ఉమాదేవి, ఈసం పద్మ,లక్ష్మి,సత్యనారాయణ కోరి,భాద్రు, పాషా తదితరులు పాల్గొన్నారు.