
కెసిఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి //15/ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్// కుమార్ యాదవ్.. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ చేసారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న వృక్షార్చన కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో “ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలన్నారు.మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం మన బాధ్యత, అని ఇది మన భవిష్యత్ తరాలకు అందించే అమూల్యమైన బహుమతి అని తెలిపారు.కేసీఆర్ కి మనం అందించే ఉత్తమ జన్మదిన కానుక కూడా ఇదే అని కౌశిక్ రెడ్డి తెలిపారు.