
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికి లాభం
విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే ఈ దేశంలో బిజెపి పాలన ఎన్నో రోజులు ఉండదు
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏం పవన్ చౌహన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి మొండిచేయి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ విద్య రంగానికి తీరని అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ అన్నారు. అలాగే వారు మాట్లాడుతూ” కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ విద్య రంగానికి మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని అన్నారు. విద్యను మరింత కార్పొరేట్ ప్రైవేటీకరణకు దగ్గర చేస్తున్న విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది గతం కంటే విద్య రంగానికి బడ్జెట్లో నామమాత్రంగా 0.2% మాత్రమే పెరిగింది 1247.39 కోట్ల నుండి 12500 మాత్రమే విద్య రంగానికి నిధులు పెరిగాయి ఈ నిధులు విద్యారంగా అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవు ఇప్పటికే పాఠశాల విద్యకు దేశంలో నిధుల కొరత తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యకు 73008 కోట్ల నుండి 78572 కోట్లకు నిధులు కేటాయించారు. 500 కోట్లు మాత్రమే పెంచారు ఇలా బడ్జెట్లో పేద విద్యార్థులకు విద్యకు దూరం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని వారు అన్నారు. ఉన్నత విద్య కోసం నామమాత్రంగానే 2025-2026 బడ్జెట్ కనిపిస్తుంది రూ” 50077.95 కోట్లకు కేవలం 5% మాత్రమే పెరుగుదల చూడవచ్చు. కాబట్టి విద్యరంగానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో చాలా అన్యాయం చేస్తుంది కేవలం తెలంగాణ పట్ల మొండి వైఖరి నిరసిస్తూ తెలంగాణకు కావలసిన వాటా కేటాయించకుండా అన్యాయం చేస్తా ఉన్నది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి అయింది కానీవిభజన హామీ చట్టంలో ఉన్నటువంటి విద్య రంగానికి కేటాయించాలని జిల్లాకు ఒక నవోదయ పాఠశాల త్రిబుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ లాంటి ఒక హామీలు ఆనాడున్నికల విభజన హామీలు చెప్పి నేటికీ పది సంవత్సరాల పూర్తి కావస్తా ఉన్నది ఇప్పటివరకు బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా తెలంగాణకు కేటాయించకుండా అన్యాయం చేస్తా ఉన్నారు అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో మరెన్నో రోజులు ఈ బీజేపీ పాలన ఉండదు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు కార్మికులు కర్షకులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు