
పయనించే సూర్యుడు. జనవరి29. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. పాల్వంచ రూరల్:
గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈటీవల చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డు పంపిణీ,ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను పంపిణీ చేస్తున్న దానికి కృతజ్ఞతగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.పాల్వంచ మండల పరిధిలోని తొగ్గ్గూడెం గ్రామంలో అక్కడ గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాని కిముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ రైతు భరోసా కింద మొదటి విడతగా రూ.6000 , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 6000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ అయిందన్నారు.
గతంలో రైతులు ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ,మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో నీ
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలందరూ మద్దతుగా ఉండాలని కొత్వాల అన్నారు.ఈకార్యక్రమమ్మం లో కాంగ్రెస్ నాయకులు కీసర రామ్మూర్తి,భూక్య గిరిప్రసాద్, కొండం పుల్లయ్య, బాదర్ల జోషి, మాలోత్ నంద నాయక్, చౌగాని అప్పారావు, బాలాజీ, వెంకట్రెడ్డి కుమార్, బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు