పయనించే సూర్యుడు రిపోర్టర్ వంశీ
కోసిగి మండలం జంపాపురంలోని ప్రజలు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు ఆహ్వానం మేరకు తాయమ్మవ్వ గుడి ప్రారంభోత్సవం శుభ కార్యక్రమానికి హాజరైన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ప్రియ సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి కి ఘన స్వాగతం పలికి శాలువా మరియు పూలమాలతో సత్కరించి గుడి ప్రారంభోత్సవం ఆయన చేతుల మీద జరిపించారు. అనంతరం
కోసిగి టౌన్ లోని రెండు చోట్ల జరిగిన టీడీపీ కార్యకర్తల శుభ వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ముత్తు రెడ్డి గారు, మాజీ డిసిసి నీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి , కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ , నడిగినేని అయ్యన్న , కోసిగి టౌన్ ప్రెసిడెంట్ చింతలగేని నర్సిరెడ్డి ,ముకయ్య, వీరయ్య, నర్సారెడ్డి, గొర్రెల తిక్కయ్య, ఎద్దుల దొడ్డి ముత్తన్న, చిన్న అంబయ్య మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.