
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 6. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- క్రీడల్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న విద్యార్థినులకు అభినందనలు….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- సీఎం కప్ ఫుట్ బాల్ పోటీ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్
క్రీడల్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు.
గురువారం జిల్లా కలెక్టర్ ను, కలెక్టరేట్ లో సీఎం కప్ పుట్ బాల్ పోటీలలో విజేతలైన వివిపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కలిసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు సీఎం కప్ పుట్ బాల్ పోటీలో విజయం సాధించడం, ఖేలో ఇండియా స్థాయిలో అండర్ 13,15,17 గ్రూప్ లలో రన్నర్స్ గా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించేలా తీర్చిదిద్దిన టీమ్ కోచ్ మాధురీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో జరిగే అనేక పోటిలలో సైతం రాణించి మంచి ఫలితాలు సాధించాలని, క్రీడాకారులకూ అవసరమైన వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కోచ్ ఆదర్శ కుమార్, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.