
__ముఖ్య అతిథులుగా మాజీ టిడిపి ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి కర్నూలు జిల్లా పెద్ద కడబూర్ మండలం నెమలికల్లు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి వారి ఏడవ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివారికి అభిషేకం అర్చన జరిపారు తదుపరి స్వామి వారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు టిడిపి యువ నాయకుడు భూపాల్ చౌదరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ దేవాలయ అభివృద్ధి కొరకు నా వంతు సహకారం అందిస్తాము అలాగే ప్రభుత్వం నుండి సహాయ సహకారం అందే విధంగా చూస్తాను ఎల్లవేళలా మా కుటుంబ సమేతంగా దేవాలయానికి మరియు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం అంటూ మాజీ టిడిపి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు ఇక్కడ ముఖ్యంగా దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున దయచేసి మాకు సీసీ రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటూ మౌనేశ్వర స్వామి భక్త బృందం వారు వేడుకుంటున్నారు