ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు జనవరి 15 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్ )… మతసామరాశ్యానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ జహంగీర్ పీర్ దర్గాలో బుధవారం ఉదయం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుసూల్ -ఏ- షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు.ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే దర్గా ఉర్సు నేపథ్యంలో ప్రతి ఏటా గుసూల్ -ఏ- షరీఫ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సందర్భంగా దర్గాలో బాబాల సమాధులను పాలతో శుభ్రపరిచి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..ఉర్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మె సత్యనారాయణ,మాజీ సర్పంచులు మిట్టు నాయక్, అజయ్ నాయక్, మాజీ మండల అధ్యక్షుడు పెంట నోళ్ళ యాదగిరి,యువ నాయకుడు శివ చారి, ఇంద్రసేనారెడ్డి,గుండు గోపాల్ నాయక్,సల్ల యాదగిరి,శంకర్,సభావత్ గోపి నాయక్,రామ్ నాయక్, జంగయ్య యాదవ్, నవాజ్, ముస్లిం మత పెద్దలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.