
పయనించే సూర్యుడు జనవరి 18 : జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :… సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 1,75,582 రూపాయల చెక్కును బాధితు కుటుంబ సభ్యులకి అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 1,75,582 రూపాయల చెక్కును బాధితు కుటుంబ సభ్యులకి అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట నియోజకవర్గం లో వత్సవాయి మండలం, దేచుపాలెం గ్రామానికి చెందిన షేక్ కరీం సాహెబ్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ప్రైవేట్ హాస్పటల్ నందు చికిత్స చేయించుకుని మెడికల్ బిల్ల్స్ ను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రిఫరెన్స్ లెటర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 1,75,582 రూపాయల చెక్కును బాధితు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అవసరానికి డబ్బు లేక ఏ ప్రాణం పోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అని అన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు సీఎం సహాయ నిధి నుంచి సత్వరం చేయూత అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేచుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి పాపారావు, కౌన్సిలర్ నకిరకంటి వెంకట్, టిడిపి సోషల్ మీడియా వారియర్ మునగాల వంశీ తదితరులు పాల్గొన్నారు.