పయనించేసూర్యుడు,జనవరి 15,కాప్రాప్రతినిధి సింగం రాజు:డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 9,10 తరగతి విద్యార్థులకు డిసెంబర్ 29న 34వ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్ష ఫలితాలను సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ జి.ఎస్.వి.ఆర్ కె చౌదరి,కార్యదర్శి కే రామరాజు,ఉపాధ్యక్షులు కే లక్ష్మణరాజు,సంయుక్త కార్యదర్శులు సి.చంద్ర శేఖరం, వైవి సుబ్బారావుఇతర కార్యవర్గ సభ్యులు యంటీకె హరినాథ్ లతో కలిసి బుధవారం విడుదల చేశారు.ఈ పరీక్షలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 విద్యార్థులు అర్హత సాధించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రధమ ద్వితీయ తృతీయ ర్యాంకర్లు వివరాలను ఆయన వెల్లడించారు.తొమ్మిదవ తరగతిలో ప్రథమ ర్యాంకు సూర్యాపేటకు చెందిన కొమ్ము కార్తికేయ,ద్వితీయ ర్యాంకు సూర్యాపేటకు చెందిన వలువుల వైష్ణవి,తృతీయ ర్యాంక్ సూర్యాపేటకు చెందిన రామరాజు వెంకట్ సాయి ప్రణవ సాధించారు.పదవ తరగతిలో ప్రధమ ర్యాంకు రాజమండ్రి కు చెందిన కశ్యప వంశీ ఇళ్ల, ద్వితీయ ర్యాంకు రాజమండ్రి కు చెందిన పూజేంద్ర వడ్లమూడి,తృతీయ ర్యాంకు సూర్యాపేటకు చెందిన యాతం ప్రజ్ఞ రెడ్డి.ఇవి కాకుండా తొమ్మిదో తరగతిలో19 ర్యాంకర్లను, పదో తరగతిలో 18 ర్యాంకర్లను ప్రకటించారు.ఈ విద్యార్థులకు ఫిబ్రవరి 9వ తారీఖున పురస్కారం అందజేయనున్నట్లుప్రథమ బహుమతికి 25 వేల రూపాయలు,ద్వితీయ బహుమతికి 15 వేల రూపాయలు,తృతీయ బహుమతికు పదివేల రూపాయలు అందజేయనున్నట్లు సంస్థ కార్యదర్శి కే.రామరాజు తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 9.30 నిమిషాలుకు నగదు పురస్కారంసర్టిఫికెట్లు,డాక్టర్ హోమీజేబాబా కమ్యూనిటీ హాల్,డాక్టర్ ఏఎస్ రావునగర్ లోఅందజేయనున్నట్లు కార్యవర్గం తెలియపరిచారు.