
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇరవై ఏడు ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ అధికారంలోకి రావడం విశేషం బీజేపీ ప్రభుత్వం వచ్చిందో లేదో అప్పుడే మార్పులు మొదలయ్యాయి తాజాగా ఢిల్లీలో ఏరియాల పేర్లు మార్చాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని నజఫ్ ఘర్ ను నహర్ ఘర్ గా మహమ్మద్ పూర్ ను మాధవపురంగా ముస్తఫాబాద్ ను శివ్ విహార్ గా పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే యూపీలో అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్ రాజ్ అయ్యింది ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఇదే తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా మొఘల్ పాలకులతో సంబంధం ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి సౌత్ ఢిల్లీ నియోజకవర్గంలోని మహమ్మద్ పూర్ పేరుని ఆర్కే పురంగా మార్చాలని అనిల్ శర్మ డిమాండ్ చేశారు దీనికి సంబంధించి సభలో ప్రతిపాదన పెడతానని ఆయన చెప్పారు పేరు మార్పునకు సంబంధించి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు