పయనించే సూర్యుడుD.23.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారు బొమ్మిత్త గంగారం కి ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి, అలాగే మానాల మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాల కు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు ఇది ఒక నిదర్శనం.ప్రజల సంక్షేమమే లక్ష్యం…ప్రతి కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో విలేజ్ ప్రెసిడెంట్ ఎంబరి నరేష్ ex ఎంపీటీసీ శ్రీనివాస్ చిన్న నారాయణ నర్సయ్య నర్సరాజ్ మహేష్ మల్లేష్ సాగర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు