Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్తలసేమియా చిన్నారికి సకాలంలో ఓ పాజిటివ్ రక్తం అందజేత...

తలసేమియా చిన్నారికి సకాలంలో ఓ పాజిటివ్ రక్తం అందజేత…

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 30 జబ్బర్ కామారెడ్డి ఇన్చార్జి.

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…

కామారెడ్డి జిల్లాకి జుక్కల్ మండలానికి చెందిన ఓంకార్ 10 సంవత్సరాల బాలుడు తలసేమియాలతో బాధపడుతూ వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని ఐవిఎఫ్ యువజన విభాగం జగద్గిరిగుట్ట అధ్యక్షులు కాపర్తి నాగరాజు సాహరంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో పటోళ్ల జనార్దన్ రెడ్డి ఓ పాజిటివ్ రక్తాన్ని ఈరోజు అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు.రక్తదానానికి ముందుకు వచ్చిన పటోళ్ల జనార్దన్ రెడ్డికి ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 కి తెలియజేయలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments