
ఎన్టీఆర్ జిల్లా
తిరువూరు నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కొరకు అన్నిరకాల పోటీ పరీక్షల కొరకు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డా” బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనే పేరుతో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్. పయనించే సూర్యుడు జనవరి 6 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.ఏపీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ కోచింగ్ సెంటర్ యొక్క సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఉద్యోగ సాధనే ఊపిరిగా.. బంగారు భవిష్యత్ కేరాఫ్ గా కొనసాగుతున్న డా. బిఆర్ అంబేద్కర్ స్టడి సెంటర్.విద్యే శాసనసభ్యుని మొదటి ప్రాధాన్యత అతని పేరే కోలికపూడి శ్రీనివాస్..తాను చదువుకునే క్రమంలో పడిన కష్టాన్ని మరే విద్యార్థికి ఎదురవ్వకూడదనుక్కున్నారుఆర్థికభారం పేదరికానికి చదువులకు ఆటంకం కాకూడదని నమ్మిన నేతే ఎంఎల్ఏ కొలికపూడి..చదువే బంగారు భవిష్యత్ అని అప్పుడు “కొచ్ గా పాఠాలు చెప్పిన నేటి ప్రజాప్రతినిధి- కొలికపూడి శ్రీనివాస్.
చదువు పూర్తయిన నిరుద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటేకోచింగ్ ఎక్కడకు వెళ్ళాలి,ఆర్థిక ఇబ్బందులు ఎలా భరించాలి అని నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళన.ఉద్యోగమే లక్ష్యంగా విద్యనభ్యసించి కొలవుల కోసం నిరీక్షించే వారికి నేనున్నా అంటూ భరోసా కల్పించారు.నిరుద్యోగ యువతీ,యువకులకు ఎక్కడెక్కడో చెప్పే కోచింగ్ సెంటర్ల పేరు కాదనుకున్నారు.కోచింగ్ ఇచ్చి ఇక్కడి నుండే ప్రభుత్వ కొలువులు సాధించేలా పేరు మోసిన” ఫ్యాకల్టీలతో నిర్వహిస్తుందే కోచింగ్ సెంటర్.ఇప్పుడు నిరుద్యోగుల బంగారు కలలు నేరవేర్చేందుకు అండగా, భరోసాగా, ఆర్థికంగా అందరికీ దిక్సూచిగా రూపుదిద్దిందే “కోలికపూడి కోచింగ్ సెంటర్.తిరువూరులో డా”బి.ఆర్ అంబేద్కర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల అభిప్రాయం