
▪ కృతజ్ఞతలు తెలిపిన జీడి తిరుపతి..
పయనించే సూర్యడు //జనవరి 29// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టు దళిత బంధు.. రెండవ విడత, రాకపోవడంతో గత కొంతకాలంగా.. దళిత బంధు విషయంలో.. దళిత బందు రెండో విడత వెంటనే అమలు చేయాలని,హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్.. మరియు మంత్రి పొన్నం ప్రభాకర్,ను కోరారు.దళితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెల్లి, రెండవ విడత దళిత బంధు వెంటనే అమలు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి, ఒడితల ప్రణవ్ బాబు,మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,తీసుకెళ్లడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి.. రెండో విడత దళిత బంధు వెంటనే అమలు చేయాలని, ఆదేశాలు జారీచేశారని అన్నారు.జిల్లా కలెక్టర్, మరియు ఈ డి, ఉత్తర్వులు జారీ చేసినందుకు ఒడితల ప్రణవ్ కు మరియు పున్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలుతెలుపు కుంటున్నాము, అని వినవంక మండలం మరియు వల్లభాపూర్ గ్రామ దళిత నాయకులు అన్నారు. దళిత బంధు విషయంలో, ప్రణవ్ కు పొన్నం ప్రభాకర్ కి, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు నాయకులు జీడి తిరుపతి, అందే కుమార్, అంబాల రాజేష్, ఖండే మహేందర్, జీడి కుమారస్వామి, దాసారపు పరమేష్, గుండేటి సుధాకర్, జిలకపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.