Saturday, February 1, 2025
Homeతెలంగాణథీమ్‌ పార్కు తరహాలో అభివృద్ధికి ప్రతిపాదనలు:డీసీ మోహన్ రెడ్డి

థీమ్‌ పార్కు తరహాలో అభివృద్ధికి ప్రతిపాదనలు:డీసీ మోహన్ రెడ్డి

Listen to this article

శేరిలింగంపల్లి, జనవరి 31 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)

ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిం చేలా పార్కులను సుందరీకరించే దిశగా చర్యలు చేపడతామని చందానగర్‌ సర్కిల్‌ ఉప కమీషనర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.విలువైన పార్కు స్తలాల రక్షణతో పాటు విభిన్నమైన థీమ్‌ పార్కు తరహాలో అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని అపర్ణ కమ్యూనిటీలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎకరానికి పైగా పార్కు స్తలాన్ని అభివృద్ధి చేయాలని అపర్ణ కమ్యూనిటీ ఫెడరేషన్‌ అధ్యక్షురాలు రాణిరెడ్డి నేతృత్వంలో సభ్యులు రెండు రోజుల క్రితం డీసీని కలిసి విన్నవించారు. ఈ మేరకు వారి విన్నపంతో బయోడైవర్సిటీ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ , సానిటేషన్‌ విభాగాలతో కలిసి డీసీ మోహన్‌రెడ్డి శుక్రవారం సదరు పార్కును సందర్శిం చారు. పార్కులో ఏపుగా పెరిగిన
చెట్లతో పాటు బండరాళ్లు,ఇతర కంపచెట్లను పరిశీలించటంతో పాటు
ఒక వైపు పార్కు గోడను తొలగించి బారీకే డింగ్‌ వేయటాన్ని డీసీ పరిశీలిం చారు.ఈ సందర్భంగా డీసీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ విలువైన పార్కు స్తలం ఆక్రమణకు గురి కాకుండా ప్రహరీ పున ర్నిర్మాణం చేయాలని,పార్కు లోపల చెత్త,అవసరపు చెట్ల తొలగింపు సహా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఇంజినీ రింగ్‌ అధికారులకు సూచించారు. ఫెడరేషన్‌ భాగస్వా మ్యంతో పార్కును మరింత సుందరీ కరించి థీమ్‌ పార్కు తరహాలో అభివృద్ధికి ఉన్నతాధికారు లకు ప్రతిపాదనలను తయారు చేసి పంపాలని సూచిం చారు.అపర్ణ పరిస రాలలో నివసించే వందలాది కుటుం బాలకు ఈ పార్కు ఎంతగానో దోహ
దపడే అవకాశం ఉన్నదని ఫెడరేషన్‌ అధ్యక్షురాలు రాణిరెడ్డి డీసీకికి విన్న వించారు.పార్కు అభివృద్ధిలో తమ తోడ్పాటు అందిస్తా మన్నారు.ఈ కార్యక్రమంలో ఈఈ కేవీఎస్ఎన్‌ రాజు,డీఈ దుర్గాప్రసా ద్‌,డాక్టర్‌ రవి,టీపీఎస్ రాకేష్,యుబీడీ అధి
కారి సమీర,ఫెడరేషన్‌ ప్ర తినిధులు విక్రమ్‌,రమేష్‌,డాక్టర్‌ రాజారామ్‌,
డాక్టర్‌ నారాయణరె డ్డి,పద్మ,రాగిణి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments