
పయనించే సూర్యుడు,ఫిబ్రవరి 03,కాప్రా ప్రతినిధి సింగం రాజు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి ఆలయ నిర్వాహకులకు సూచించారు.కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి సోమవారం కుషాయిగూడ నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయాన్ని సబ్ ఇన్స్పెక్టర్ సాయిలు,చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు.ముందుగా అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి ప్రతినిధులు ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి కి శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు రవి గుప్త,దొంతి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,ఆంజనేయులు, రామ్ రెడ్డి,జనార్ధన్, ఈశ్వరయ్య,లక్ష్మణ్,రాకేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.