పయనించే సూర్యుడు జనవరి 14 (పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్: ధనుర్మాస పూజల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవ భారత్ లో గల గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దేవాలయం పూజారి నడా దూర్ శేషా చార్యులు అలాగే నడ దూర్ మురళీకృష్ణ ఆచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.