
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 4. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వంచ టౌన్:
శనివారం నాడు ఖమ్మం లో జరిగిన నేషనల్ లెవెల్ కరాటే కాంపి టీషన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఏ.ఐ.ఏం లీడ్ స్కూలుకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి షణ్ముక్తు సాయి ప్రథమ బహుమతి పొందిన సందర్భంగా పాల్వంచ డిఎస్పి ఆర్.సతీష్ కుమార్ మరియు సీఐ కే సతీష్ అభినందించారు. ఈ సందర్భంగా డిఎస్పి సతీష్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రాతినిధ్యం కన పరచాలని ఆకాంక్షించారు. ఏ.ఐ.ఏం లీడ్ స్కూల్లో విద్యార్థుల కు చదువుల తోపాటు ఆటల్లో కూడా వారి ప్రాతి నిధ్యాన్ని అందించటం గొప్ప అంశమని అభినందించారు.. నేషనల్ లెవెల్ కరాటే కాంపి టీషన్లో మొదటి బహుమతి సాధించడం పాల్వంచ కు దక్కిన ఒక అదృష్టంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రెంటాల నాగభూషణం మాట్లాడుతూ ఏ ఐ.ఏం లీడ్ స్కూలు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ లో విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులు ప్రతిదీ వ్యక్తిగత అనుభవాల ద్వారా నేర్చు కుంటారని క్రీడలకు పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ సీఐ కే సతీష్, ఎస్ఐ బీ రాఘవయ్య. పాఠశాల ఏవో మోహన్ రావు, పి ఈ టి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు