Wednesday, April 23, 2025
Homeతెలంగాణపద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం

పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 డివిజన్ ప్రతినిధి సిరందాసు : వెంకటేశ్వర్లు, దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం ఈరోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాట్లాడిన కమర్తపు మురళి మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్న 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ & 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభను విజయవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.అలాగే, పద్మశాలి సంఘం మనుగడ, ఐకమత్యం, హక్కుల సాధన కోసం స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి, తెలంగాణ పోరాట యోధుడు శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం స్పూర్తిగా నిలవాలని ఆయన సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం ఏకతాటిపైకి రావాలి అంటూ, ఎన్ని అవరోధాలు, ఆటుపోట్లు వచ్చినా పద్మశాలి సంఘం హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని మురళి పిలుపునిచ్చారు.సభలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ. నల్లగొండ జిల్లా అధ్యక్షులు పుట్ట బత్తుల సత్య నారాయణ, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్,సమితి నాయకులు తిరందాసు కృష్ణయ్య, పున్న వెంకటేశ్వర్లు, యేలే యాదయ్య, బాసర కార్యదర్శి చిట్టి పౌలు శ్రీరాములు కార్యకర్తలు పగిడిమర్రి రఘురాములు, రావిరాల వీరయ్య, పగిడిమర్రి నాగరాజు, గాజుల వినయ్ మహిళా ప్రతినిధులు మాకం చంద్రమౌళి, పున్న శైలజ, చెరిపల్లి జయలక్ష్మి, గుర్రం విజయలక్ష్మి తదితరులుఈ కార్యక్రమం సమాజ ఐక్యత, హక్కుల సాధన, భవిష్యత్తు కార్యాచరణ దిశగా కీలకంగా నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments