
పార్టీ బలోపేతమే లక్ష్యం
ఎస్సీ ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
–టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు
పయనించే సూర్యుడు రాజంపేట ఫిబ్రవరి 04:
పసుపు జెండానే తన ప్రాణంగా సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎదిగిన దళిత తేజో కిరణం మందా శ్రీనివాసులు అని చెప్పడంలో సందేహం లేదు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి మొదలైన ఆయన ప్రస్థానం పట్టణ యువత అధికార ప్రతినిధిగా, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు, రాపూరు అబ్జర్వర్ గా అనేక కీలక పదవులలో తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించి నియోజకవర్గంలోనే కాక జిల్లా స్థాయిలో టిడిపి ముఖ్య నాయకులు, ప్రజలకు నోట్లో నాలుకలా మారిన మందా శ్రీనివాసులు ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ అనేక అంశాలు తెలియజేశారు. నియోజకవర్గంలో నాయకులు మారినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదురైనా ఏమాత్రం చలించకుండా మొక్కవోని దీక్షతో పార్టీ జెండా కోసం నిలబడ్డానని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తలవంచక నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేశానని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థులు తనపై దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటన పత్రికలలో సైతం ప్రచురితమైనదని, ఇలాంటి విపత్కర పరిస్థితులలో తెదేపా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు దాడి కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించి భరోసానివ్వడం తనకు మనోధైర్యాన్ని నింపిందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ అన్యాయం చేయదని, తాను ఎప్పటికీ పసుపు జెండా మోస్తూ పార్టీకి సేవ చేయడంలోనే ఆత్మసంతృప్తి ఉందని వివరించారు. విజనరీ నాయకులు చంద్రబాబు సారధ్యంలో ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, యువ కెరటం నారా లోకేష్ బాబు రాష్ట్రంలోని యువత ఆశలు, ఆశయాలకు అండగా నిలుస్తూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సహకారంతో తనను నమ్మిన ఎస్సీ సామాజిక వర్గానికి అండగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. గ్రామాలలో తనకున్న బందు గణం, తన సామాజిక వర్గం అండతో రానున్న స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ తెలుగుదేశం జెండా ఎగర వేసేందుకు కృషి చేస్తానని, పసుపు జెండానే తన ప్రాణమని తెలియజేశారు.