
*జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం *అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి *అక్రిడేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది కాప్రా సర్కిల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు ఆమోదం
పయనించేసూర్యడు,జనవరి 30,కాప్రాప్రతినిధి సింగం రాజు :ఉప్పల్ నియోజకవర్గం లో పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమం కోసం టీ డబ్ల్యూ జె ఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్య అన్నారు.గురువారం ఉప్పల్ నియోజకవర్గ టి డబ్ల్యూ జె ఎఫ్ సమావేశాన్ని భవాని నగర్ లో నియోజకవర్గ అధ్యక్షుడు గంగి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలు వాటి పరిష్కారం పై నిరంతరం పాటుపడుతున్న పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి సరైన సహాయ సహకారాలు లేవని,సంక్షేమ పథకాలు అందడం లేదని,పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో అక్రిడేషన్ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ కాప్రా సర్కిల్ ప్రెస్ క్లబ్ లో అన్యాయానికి గురైన తోటి మిత్రులకు టీ డబ్ల్యూ జె ఎఫ్ అండగా నిలవాలని కోరారు.మాటలకు,చేతులకు పొంతన లేని కాప్రా ప్రెస్ క్లబ్ తీరును ఎండగడుతూ కాప్రా సర్కిల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.మిత్రునికి మిత్రుడు శత్రువు అన్నట్టుగా కాప్రా ప్రెస్ క్లబ్ పనితీరు ఉందని,ప్రక్షాళన అంటూ ఎజెండా,తీర్మానాల అమలుకు నీతి,నిజాయితీ,నిబద్ధత లేకుండా కొందరు వ్యక్తుల స్వార్థానికి తోటి పాత్రికేయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.సీనియర్లకు ప్రాధాన్యత లేదని ప్రక్షాళన పేరుతో ఆరు బయట వేసుకున్న కమిటీ పనితీరు హాస్యాస్పదంగా ఉందని,ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ప్రక్షాళనకు గురి కావాల్సిన వ్యక్తులకే పదవులు అంటగట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఒక వ్యక్తికి ఒక ప్రెస్ క్లబ్ లోనే మెంబర్ షిప్ ఉండాలని,స్థానికంగా ఐదేళ్ల కాలం పాటు పని చేసి ఉండాలన్న ఎజెండా,తీర్మానాలు కాప్రా ప్రెస్ క్లబ్ అమలు చేసిన పాపాన పోలేదన్నారు.జిల్లా ప్రెస్ క్లబ్ లో మెంబర్ షిప్ ఉన్న వాళ్లకి కాప్రా ప్రెస్ క్లబ్ లో మెంబర్ షిప్ ఎలా ఇస్తారని వారు నిలదీశారు.కాప్రా ప్రెస్ క్లబ్ ఐదేళ్లు క్రితం ఏర్పాటైనప్పుడు అందులో ఉన్న ప్రతి సభ్యుడికి అర్హత ఉంటుందని అలాంటప్పుడు మెంబర్ షిప్ రెన్యువల్ ను ఎలా తిరస్కరిస్తారని వారు నిలదీశారు.ప్రస్తుత సభ్యులందరికీ స్థానికంగా అక్రిడేషన్,వారి పత్రికలకు ఎం పానల్ మెంట్,ఆర్ ఎన్ ఐ,పేపర్ ప్రింటింగ్ ఉందా అని ప్రశ్నించారు.ముద్ర, దిశ తో పాటు పలు పత్రికలు ఈ కోవకే వస్తాయి కదా అలాంటి వారికి సభ్యత్వం ఇవ్వడం ఎంతవరకు సబబు అన్నారు.కాప్రా లో అన్యాయానికి గురైన పాత్రికేయులకు టి డబ్ల్యూ జె ఎఫ్ అండగా నిలవాలని వారు కోరారు.సర్కిల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి వారందరికీ మేమున్నామంటూ రాష్ట్ర,జిల్లా నాయకులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపల్లి పద్మా రెడ్డి,ప్రసాద్, పటేల్ నరసింహ,యావపురం రవి,బెలిదే అశోక్,రామచంద్ర మూర్తి,కిరణ్,నరేష్,శుభ తెలంగాణ శ్రీనివాస్,వాణి, గాయత్రి,శ్రీనివాస్ రెడ్డి,సురేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.