పయనించే సూర్యుడు జనవరి 30(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మండల కేంద్రంలో జనగామ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పాలకుర్తి మండల,పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పాలకుర్తి మండల అధ్యక్షుడు చిదర జగదీశ్,పట్టణ అధ్యక్షుడు బోనగిరి రంగయ్య లు మాట్లాడుతూ మహాత్మ గాంధీ 1948 జనవరి 30న న్యూ ఢిల్లీలోని బిర్లా హౌస్ ప్రాంగణంలో హిందూ జాతీయవాది నాథూరామ్ గాడ్సే చేతిలో మహాత్మా గాంధీ హత్య చేయబడ్డారని,మహాత్మా గాంధీ అహింస ఉపదేశకుడు
చంపారన్ సత్యాగ్రహం మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన మొదటి సత్యాగ్రహం అని వారన్నారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సలహాదారులు రాపాక సత్యనారాయణ,జిల్లా జనగామ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాగమళ్ళ సోమేశ్వర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గజ్జి సంతోష్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, సంఘం నాయకులు బజ్జురి వేణుగోపాల్,రాపాక విజయ్, మాధం శెట్టి భాస్కర్, రాపాక సోమశేఖర్, దొడ్డ వెంకటేశ్వర్లు, నంగునూరి సోమేశ్వర్, మెతుకు రాజు, రాపాక రమేష్, పబ్బ సంతోష్, మెతుకు రమేష్, నంగునూరి మధు, ఆరూరి రవి, బోనగిరి విద్యాసాగర్,తదితరులు పాల్గొన్నారు
పాలకుర్తి మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES