
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు… ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ రెండు జిల్లా కమిటీ లు మంగళవారం ఇల్లందు ఐఎఫ్టియు ఆఫీస్ లో జరిగిన ఉమ్మడి సమావేశం లో ఇప్పటి వరకు రెండు కమిటీలు గా పని చేసిన కమిటీలను ఒకటి గా ఐక్యత చేయడం జరిగింది అనంతరం నూతన జిల్లా కమిటీ ని 21 మంది తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ లోకి టేకులపల్లి మండల కార్యదర్శి గా పని చేస్తున్న తోటకూరి. సతీష్ ని ఎన్నుకోవడం జరిగింది అని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ. రమేష్ ఒక ప్రకటన లో తెలియజేసారు.