
టీ టిడిపిరాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్
పయనించే సూర్యుడు జనవరి 16 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు మండల లో ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా 12 వార్డు వాకిటి బాలరాజు కుటుంబం లో 8 మంది సభ్యత్వం చేసుకోవడం గర్వకారణంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామన్ గౌడ్ అన్నారు
ఈ సందర్బంగా గా రామన్ గౌడ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రలలో ఒక కోటి రెండు సభ్యత్వాలు దాటినాట్లు చెప్పారు
ఇటీవల కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా
కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు..
ఇటీవల మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు.
ఒప్పందం ప్రకారం
జనవరి 1, 2025
నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది
కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో
రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది….
వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో
ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది.
ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు
రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుందని రాష్ట్ర కార్యదర్శి సుర గౌని రామన్ గౌడ్ అన్నారు
పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకోగల పార్టీ టీ టీడీపీ పార్టీ అని రామన్ గౌడ్ అన్నారు
భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు..
వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తుదాని రామన్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ నాయకులు వాకిటి బాలరాజ్ శ్రీహరి తిరుమలేష్ రాజు శెట్టి తదితరులు పాలొగొన్నారు