పయనించే సూర్యుడు న్యూస్ : రామగిరి : సెంటినరీ కాలనీ -14:-
దివంగత శ్రీపాదస్మారక క్రికెట్ టోర్నమెంట్లో మంగళవారం రాణి రుద్రమదేవి స్టేడియంలో రాజకీయ జట్టు మీడియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పొలిటికల్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మీడియా జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగుల సాధించింది. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పొలిటికల్ జట్టు ఓపెనర్ మాజీ ఎంపిటిసి కొట్టే సందీప్ తొలి బంతి నుండే బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు.ఈ క్రమంలో అర్థ సెంచరీ చేసిన సందీప్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మైదానం నలుమూలల భారీ షాట్లు కొడుతూ ప్రేక్షకులను అలరించాడు.వికెట్ నష్టపోకుండా రాజకీయ జట్టు లక్ష్యాన్ని సాధించింది.ఒంటి చేత్తో జట్టును గెలిపించిన సందీప్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు మేన్ ఆఫ్ ద మ్యాచ్ అందజేశారు.