పయనించే సూర్యడు సిహెచ్.విద్యా సాగర్
దేవీపట్నం మండలం
ఫిబ్రవరి:-01
గోదావరికి ఇరువైపుల ఉన్న ప్రకృతి అందాలు,గుట్టలపై ఉండే గిరిజన గూడేలు,ఆకుపచ్చని రంగుల్లో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా ? అయితే మీరు పాపికొండల యాత్రకు వెళ్లాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాపికొండలు యాత్రను సందర్శించాలంటే
అల్లూరు జిల్లా(పాడారు) దేవీపట్నం మండలం,పూడిపల్లి గ్రామపంచాయతీ,గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజన దేవత గండి పోచమ్మ.పాపికొండ యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై….బోట్లు,లాంచీలు తొలిత ఇక్కడికి రావాల్సిందే,పర్యాటకులు,లాంచీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి గండి పోచమ్మ తల్లిని దర్శించుకుంటారు.
పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోటులో ప్రారంభమై….పేరంటాలపల్లీ వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు.ఆంధ్రప్రదేశ్,(ఉభయగోదావరి జిల్లాలు) తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా రాజమహేంద్రవరం(రాజమండ్రి)చేరుకోవాలి.
ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు.ఇది ప్రశాంతమైన,సుందరమైన,రమణీయ మైన,ఆహ్లాదకరమైన,ప్రదేశము.ఇక్కడి కొండలు,గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు,చిరుత పులులు,నల్ల పులులు,అడుగు దున్నులు(గొర్రగేదెలు),అడవి పందులు,జింకలు,దిప్పులు,నక్కలు, తోడేళ్లు,నెమల్లు,కొండచిలువలు,కింగ్ కొబ్రాలు,వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు,ముళ్ళ పందులు,అడవి తాంబేలు,వివిధ రకాల పక్షులు,విష కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది.అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, వనమూలికల మొక్కలు పురాతన దేవాలయాలు ఉన్నాయి.
పేరంటాలపల్లీ సందర్శన:-పాపికొండలు యాత్రలో పేరంటాలపల్లీ వద్ద ఉన్న ప్రాంచీన శివాలయం వద్ద లాంచీ ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడికి ఆదివాసి గిరిజనులు నిర్యాహిస్తున్నారు.గుట్ట పై నుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు.
జలవిహారం:-ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పర్యటన యాత్ర ముగుస్తుంది.గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుతమైన అవకాశం యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది.
ఇసుక తినల్లో విడిది:- రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం ఇసుక తిన్నెలు వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే రాత్రి వేళ బస చేయాల్సిందే.
పటిష్టమైన రక్షణ:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకులకు అనుగుణంగా పూర్తి రక్షణ చర్యలతో పాపికొండల విహార యాత్ర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.లాంచీ లో వెళ్లే పర్యాటకులు ముందుగా తమ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.అలాగే పర్యాటాకులు లైఫ్ జాకెట్లను తప్పుగా ధరించాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఆదేశాలతో లాంచీలో పూర్తిగా మద్యాన్ని నిషేధించారు.కేవలం శాకాహర భోజనం మాత్రమే అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలా ఉండగా లాంచీ ప్రారంభమయ్యే సమయంలో రెవెన్యూ శాఖ,పోలీస్ శాఖ,నీటిపారుదల శాఖ పర్యాటక శాఖ,అడవి శాఖ, అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తేనే పర్యాటక లాంచీలను విహారయాత్రలకు బయలుదేరుతాయి. గోదావారి ఒడ్డున పర్యాటక లాంచీ ఎక్కి విహారయాత్రకు వెళ్తారు.
ఆకట్టుకునే వెదురు బొమ్మలు:- పేరంటాలపల్లీ దగ్గర గిరిజనులు తయారుచేసిన వెదురు బొమ్మలు,వస్తువులు,పర్యాటకులకు ఆకట్టుకుంటాయి.రూ50/- నుంచి రూ 300/- వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని….స్వాగతం గోదావరి మధుర జ్ఞాపకాల లాహిరి
RELATED ARTICLES